తన జీవితమంతా పాటలమయమని మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అన్నాడు. పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని.. తన పాటలు ప్రేక్షకుల హృదయాన్ని తాకుతాయని తెలిపాడు. అయితే ప్రస్తుత కాలంలో వస్తోన్న పాటలు ఎందుకొస్తున్నాయో తెలియట్లేదని చెప్పాడు. మేల్ సింగర్, ఫిమేల్ సింగర్లకు ఒకరు పడింది మరొకరికి తెలియడం లేదని, దర్శకుడికి అసలు ఏం పాట వస్తుందో కూడా తెలియట్లేదని పేర్కొన్నాడు.