E.G: రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా శుక్రవారం 9వ వార్డులోని శ్రీనివాసనగర్‌లో ఆర్.సి.సి. బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజల సౌకర్యం దృష్ట్యా డ్రెయిన్ నిర్మాణ పనులను అత్యుత్తమ నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. ఎస్ఈ (ఇన్‌ఛార్జి) రీటా, డీఈ లోవరాజు పాల్గొన్నారు.