WGL: నర్సంపేటలోని భానోజీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆరెల్లి రచన నవీన్ దంపతుల నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే మాధవరెడ్డి హాజరై నూతన గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.