అన్నమయ్య: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేశారని నిస్సార్ అహ్మద్ అన్నారు. ఇవాళ మదనపల్లె మండలం, కొత్త ఇండ్లు గ్రామపంచాయతీలో వైసీపీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం నిస్సార్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.