WGL: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి, అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విమర్శించారు. ఇవాళ WGL జిల్లా BJP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు, నీట మునిగిన ఇళ్లు బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.