TG: మెడికల్ సీట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ PG మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఆలిండియా కేటగిరిలో సీట్ల భర్తీ ప్రక్రియ ఉండేది. నూతన విధానంతో ఉత్తర్వులు జారీ చేయాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ విధానంతో తెలంగాణ విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ PG, 70 డెంటల్ PG సీట్లు దక్కనున్నాయి.