TG: దివంగత పి.జనార్థన్‌రెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. బోరబండ చౌరస్తాకు ‘పీజేఆర్ బోరబండ చౌరస్తా’గా నామకరణం చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బోరబండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు.. పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. స్వయంగా తానే ఆవిష్కరిస్తానని తెలిపారు.