PPM: బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు శనివారం సీతంపేట ఐటీడీఏ పార్కులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డితో కలిసి పాల్గొని బిర్సా ముండాకు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బిర్సా ముండా 150వ జయంతిని ఈ రోజు మన్యం జిల్లాలో జరుపుకోవడం ఒక చరిత్ర అన్నారు.