AP: మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై X వేదికగా విమర్శలు గుప్పించారు. ‘కాశీబుగ్గ తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. పోలీసులను కేవలం కక్ష సాధింపు కోసం వాడుతున్నారు. ప్రజలు, భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకుంటున్నారు’ అంటూ మండిపడ్డారు.