మహేష్ బాబు, రాజమౌళి మధ్య జరిగిన సరదా ట్వీట్ సంభాషణ చర్చనీయాంశంగా మారింది. నవంబర్ రాగానే, ‘SSMB 29’ అప్డేట్ కోసం మహేష్ బాబు రాజమౌళిని కోరగా.. ‘సినిమా రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్ ఏంటి ఈ నెలలో?’ అంటూ రాజమౌళి సరదాగా బదులిచ్చారు. దీనికి, “మీ ‘ఫరెవర్ ఇన్ మేకింగ్’ మహాభారతం గురించి మాట్లాడుతున్నా, సర్” అని మహేష్ రివర్స్ పంచ్ ఇచ్చారు.