ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం APDMC ఆరోగ్య రధం వారితో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.కేబీకే నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవాలన్నారు. ఆరోగ్య రధం డాక్టర్ జీ.కుశల్ చైతన్య 68 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు ఇచ్చారు.