NRPT: జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆమె పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుపై వ్యవసాయ, పశుసంవర్ధక, హార్టికల్చర్, మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆయా రంగాల్లో ఉత్పాదకత పెంచేలా ప్రణాళికలు ఉండాలన్నారు.