TG: CM పదవి రేసులో తాను లేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కానీ పదవి ఇస్తే మాత్రం తీసుకుంటానని తెలిపారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ ఈ కామెంట్స్ చేశారు. తాను ఫుల్ టైం పొలిటీషన్ అని.. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని పేర్కొన్నారు. చెక్ పోస్టుల్లో డబ్బులు వసూలు చేశారని తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.