GNTR: ఫిరంగిపురం మండలంలోని అన్ని గ్రామాల్లో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు కండ్రిక గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.