బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుతో కలిసి నటి కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య నింబాల్కర్తో రాజ్ మూవీ చేయనున్నారట. ఇందులో కీర్తి, తాన్య మణిక్తలు నటించనున్నట్లు సమాచారం. ఇక భారత విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న విద్యపరమైన ఒత్తిళ్లు, సవాళ్ల గురించి చూపించనున్నారట.