ELR: చింతలపూడి మండలం నామవరంలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి బోడ గోపాలరావు వద్ద ఐదు క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మడం నేరమని, బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.