ELR: కొయ్యలగూడెంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అధ్యక్షుడు మాటూరు సుధీర్ నేతృత్వంలో సభ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకు శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని తెలుగువారంతా స్మరించుకోవాలని సుధీర్ పిలుపునిచ్చారు.