బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ధర్మేంద్ర.. ముంబైలోని క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.