RR: హయత్నగర్ డివిజన్లోని ముదిరాజ్ కాలనీలో కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి కాలనీవాసులతో కలిసి శనివారం నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామన్నారు. డివిజన్ ను ఆధునిక వసతులతో అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు.