SKLM: పలాస వెంకటేశ్వర స్వామీ ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. అధికార యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.