అన్నమయ్య: రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం పీలేరులో స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన సమావేశం జరిగింది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, స్పీడ్ గవర్నర్, అంబర్ లైట్లు వంటి పరికరాలు తప్పనిసరిగా పనిచేయాలని ఆమె సూచించారు.