ప్రకాశం: హనుమంతునిపాడులో నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్‌తో కలిసి శనివారం పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో లాకప్ గదులు, ఎస్సై కార్యాలయం, ఫిర్యాదుల విభాగాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మిగిలిన పనులను కూడా నాణ్యతగా చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.