AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. రైలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో 9 మంది మరణించారని వెల్లడించారు. మరో 13 మంది గాయపడ్డారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.