ఆసియాకప్ విషయంలో ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ పట్టువిడవడం లేదు. దీంతో మరోసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మోసిన్ చేతులమీదుగా తాము ట్రోఫీని తీసుకొనేది లేదని తేల్చి చెప్పారు. ఈనెల 4లోగా బీసీసీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆసియాకప్ భారత్కు తప్పకుండా వచ్చి చేరుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తెలిపారు.