ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. కాగా, వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ వైట్ వాష్ చేయడం 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.