KDP: మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న అన్ని పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కడప జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం కడపలో సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కడప జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.