ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా మావోయిస్టులపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల హింస కారణంగా ఛత్తీస్గఢ్ వెనుకబాటుతనానికి గురైందని మండిపడ్డారు. మన బలగాలు ఇటీవల ఉగ్రవాదుల వెన్నెముక విరిచాయని తెలిపారు. దీంతో ఛత్తీస్గఢ్ కూడా మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందిందని వెల్లడించారు. ఇక నుంచి రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరని చెప్పారు.