అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి 8.00 గంటల వరకు 93.79 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,820 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,40,878 మందికి పంపిణీ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సబ్బవరంలో అత్యధికంగా 96.55 శాతం మందికి పింఛన్లు అందజేశామన్నారు.