KDP: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ఎస్వీ డిగ్రీ కాలేజీలో శనివారం విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు సీఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు.