E.G: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అందజేశారు. రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ, పీ.జీ. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ ఎంకేఎస్ ప్రసాద్‌తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.