KDP: కడప ఉక్కు సాధనే లక్ష్యంగా పోరాటాలు సాగిద్దామని DYFI జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. DYFI ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం కడప నగరంలో నిహార్ స్కిల్ డెవలప్మెంట్ నందు నిరుద్యోగులతో కలిసి DYFI జెండా ఆవిష్కరించారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల అమలు కోసం పోరాటాలు సాగిస్తామని ఈ పోరాటంలో నిరుద్యోగ యువత పాల్గొనీ జయప్రదం చేయాలన్నారు.