BDK: పాల్వంచ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందని శనివారం స్థానికులు ఆరోపించారు. మొర్రేడ్ వాగు నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా దర్జాగా జరుగుతున్న ఈ ఇసుక దందాపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల స్పందించాలని తెలిపారు. అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు చిన్న రోడ్లలో సైతం అతి వేగంగా నడుపుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు.