ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక వర్షపాతం రీత్యా రైతులకు జరిగిన నష్టంపై విపత్తుగా ప్రకటించి రైతులకు పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పండించిన పంటకు దిగుబడి రాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.