AP: కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.