AP: కాశీబుగ్గలో తొక్కిసలాటపై దేవదాయశాఖ వివరణ ఇచ్చింది. ‘ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు. తిరుమలపై అలిగి 4 నెలల క్రితం గుడి కట్టారు. జూలై నెలలో ఆలయం ప్రారంభమైంది. గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి. ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని.. ప్రభుత్వానికి నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు. ఘటనకు నిర్వాహకుల వైఫల్యమే కారణం’ అని పేర్కొన్నారు.