AKP: రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్యులు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఆవిర్భవించిందన్నారు. ఎలమంచిలి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ గుప్తా, ఆర్యవైశ్య దేవస్థానం కమిటీ ప్రెసిడెంట్ బసవరాజు పాల్గొన్నారు.