జాతీయ అవార్డు గ్రహీత, టాలీవుడ్ సింగర్ PVNS రోహిత్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, ‘బేబీ’ మూవీలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకుగానూ రోహిత్‌కు జాతీయ ఉత్తమ సింగర్ అవార్డు వచ్చింది.