SRD: రాయికోడ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై చైతన్య కిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనం చేయగా ఆయన స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశారు. క్రైమ్ కు సంబంధించిన పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.