మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో శుభం కుమార్ సింగ్, శివ నందం కురుప్ డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. దీంతో వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల MDMA, రెండు గ్రాముల కొకైన్, 100 గ్రాముల ఓజీ, 12 ఎల్ఎస్ఓ బ్లడ్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.