VSP: బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మద్ది పంచాయతీ తుని పొలం గ్రామానికి చెందిన కాళ్ల ధనశ్రీ గత నెల 30న పల్లి గెడ్డలో గల్లంతై మృతి చెందారు. శనివారం బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.4 లక్షల పరిహారం చెక్కును మృతురాలి తల్లిదండ్రులు శ్రీను, దుర్గలకు అందజేశారు.