VZM: కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, త్రొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అధికారులను ఆదేశించారు. ఆలయాలు వద్ద డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, సముద్రాలు,జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.