AP: కాశిబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘9 మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశాం. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది’ అని వెల్లడించారు.