తమిళనాడులోని ఎన్నూరు బీచ్ వద్ద సముద్ర స్నానం కోసం వెళ్లిన నలుగురు యువతులు అలల తాకిడికి కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులను దేవకి సెల్వమ్(30), భవాని(19), షాలిని(17), మరియు గాయత్రి(18)గా గుర్తించారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతుల్లో ఒకరైన దేవకి, శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.