MDK: గ్రామపంచాయతీ ఎన్నికలలో 89.37 శాతం పోలింగ్ సాధించి రాష్ట్రంలో మెదక్ జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు చెప్పారు.