NZB: సిరికొండ మండలం కొండూరు గ్రామానికి చెందిన కారంగుల గంగవ్వ, గాదరి రాణి ఇటీవల మృతిచెందారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జి బాజిరెడ్డి జగన్ గురువారం వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, న్యావనంది సురేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.