VSP: తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాజువాక నియోజకవర్గం 66వ వార్డు బీసీ రోడ్డుకు చెందిన పిల్ల సతీష్‌కు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.3 లక్షల చెక్కును గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గురువారం అందజేశారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.