KDP: ఎర్రగుంట్ల మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఎర్రగుంట్ల ఎంపీడీవో రమణయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈరోజు ఉదయం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సర్వే పర్యవేక్షణ చేశారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్త వేరువేరుగా వేయాలని ఎంపీడీవో ప్రజలకు సూచించారు.