NTR: వత్సవాయి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు 6 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఒక వరమని, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.