దర్శకుడు దేవకట్టాతో మెగా హీరో సాయి దుర్గా తేజ్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో గతంలో ‘రిపబ్లిక్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్గా తాజా సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయట. కాగా, సాయి ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ మూవీతో బిజీగా ఉన్నారు.