ASF: రెబ్బెన మండలం గోలేటి కోదండ రామాలయం పరిసరాల్లో సింగరేణి ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏరియా GM విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. కోదండ రామాలయంతో పాటు పరిసరాలను ఆయన శుభ్రం చేశారు. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.